అంతర్గత మార్కుల నిర్ణయంపై వెనక్కి తగ్గిన సర్కార్! 20 d ago
పదో తరగతి పరీక్షల్లో అంతర్గత మార్కుల నిర్ణయంపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ విద్యాసంవత్సరం నుండి అని ప్రకటించినా, అంతర్గత మార్కుల తొలగింపుని వచ్చే విద్యా సంవత్సరం(2025-26) నుండి అమలు చేస్తున్నట్లు, అంటే రాత పరీక్షలకు 100 మార్కులు ఇచ్చే విధానం అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరం పాత విధానంలోనే, అంటే అంతర్గత పరీక్షలకు 20, చివరి పరీక్షకు 80 మార్కుల కేటాయింపు విధానమే ఉంటుంది. అయితే గ్రేడింగ్ విధానాన్ని మాత్రం ఈ విద్యా సంవత్సరం నుంచే రద్దుచేసి, గ్రేడింగ్‌కి బదులు మార్కులు కేటాయిస్తారు.